డైవర్షన్ పాలిటిక్స్‌తో ప్రజల గొంతు నొక్కుతున్నారు!
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘డైవర్షన్ పాలిటిక్స్’ నడుపుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మూడు రోజులుగా సభ జరుగుతున్నా ఒక్క ప్రజా సమస్యపైనా సమగ్ర చర్చ జరగలేదని విమర్శించారు. ‘‘22ఏ భూముల సమస్యపై చర్చ జరగకుండా చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు, రైతుల ఇబ్బందులు, నిరుద్యోగుల ఆవేదన, విద్యార్థుల సమస్యలపైనా చర్చకు అవకాశం రావడం లేదు. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలు పక్కకు పోయేలా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి’’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ వివాదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపై సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ‘‘డైవర్షన్...