కరెంట్‌ డిమాండ్‌.. కొత్త శిఖరం!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (మన విశ్వం): తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ కొత్త శిఖరాన్ని తాకింది. బుధవారం ఉదయం 10:41 గంటలకు రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ ఆల్‌టైమ్‌ గరిష్ఠంగా 19,543 మెగావాట్లకు చేరింది. రికార్డు స్థాయిలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ను విజయవంతంగా సరఫరా చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే డిమాండ్‌ ఏకంగా 23 శాతం పెరగడం గమనార్హం. 2025 సెప్టెంబర్‌ 9న గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ 15,906 మెగావాట్లు కాగా.. ఏడాది తిరిగేసరికి 19,543 మెగావాట్లకు చేరింది. గృహ, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న వినియోగంతో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆరు నెలల్లోనే రికార్డు బ్రేక్‌ ఈ...