కానిస్టేబుల్ వయోపరిమితి మరో మూడేళ్లు పెంపు!
కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగాల్లో కానిస్టేబుల్, సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవో ఎంఎస్ నం.129 విడుదల చేశారు. యూనిఫాం సర్వీసుల్లో వివిధ పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు ప్రభుత్వం గతంలో గరిష్ఠ వయోపరిమితిపై ఏడేళ్ల సడలింపు కల్పించింది. అయితే పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 32 ఏళ్లు, కానిస్టేబుల్ పోస్టులకు 29 ఏళ్లుగా ఉండటంతో మూడేళ్ల వ్యత్యాసం ఉన్న విషయాన్ని...