స్పీకర్‌ను అవమానించిన వారిని వదలం!
శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సెప్టెంబర్ 6న చోటుచేసుకున్న ఘటనలపై ప్రభుత్వం కఠిన వైఖరి ప్రకటించింది. సంఘటనల వెనుక ఎవరున్నా సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సభాపతిని, ఆయన తల్లిని అవమానించేలా వ్యవహరించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ విషయంలో స్పీకర్‌కు ప్రభుత్వం, శాసనసభ అండగా నిలుస్తాయని చెప్పారు. బుధవారం శాసనసభలో ఈ అంశంపై జరిగిన సుదీర్ఘ చర్చకు సభానాయకుడిగా సీఎం సమాధానమిచ్చారు. సెప్టెంబర్ 6న జరిగిన ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. కొందరు ఉసిగొల్పబడిన వ్యక్తులు అధికారులపై దాడులకు పాల్పడటంతోపాటు సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని ఆరోపించారు. సభాపతి...