సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలి!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు అనుచితంగా, సామాజిక ఉద్రిక్తతలకు దారితీసేలా ఉన్నాయని ఆరోపిస్తూ భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఫిర్యాదులో కోరినట్లు ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాజకీయంగా విమర్శలు, విభేదాలు ఉండవచ్చని.....