పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు కొత్త బాస్‌!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): తెలంగాణ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (టీజీపీసీబీ)కి కొత్త బాస్‌ వచ్చారు. బోర్డు చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి రాజా శేఖర్‌రెడ్డి లక్కాడిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి మూడేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ రంగంలో రాజా శేఖర్‌రెడ్డికి ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం, ఆచరణాత్మక అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ సెప్టెంబర్‌ 7న జీవో ఎంఎస్‌ నం.33 జారీ చేసింది. గతంలో 2024 మార్చి 7న...