స్పీకర్‌పై వ్యాఖ్యలు.. తాతా మధు అరెస్ట్!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 8 (మన విశ్వం): అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల వ్యవహారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టుకు దారితీసింది. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఆయన స్టేట్‌మెంట్‌ నమోదు అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నల్ల దుస్తులతో సభకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకోవడంతో గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తాతా...