కొత్తగూడెం ఎయిర్‌పోర్టుకు ముందడుగు!
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 7 (మన విశ్వం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ప్రతిపాదిత ప్రాంతాల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు భారత విమానాశ్రయాల సంస్థకు చెందిన బహుళ విభాగాల సాంకేతిక బృందం జిల్లాలో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టింది. భారత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సీతంపేట, సుజాతనగర్, దుమ్ముగూడెం, చాపరాలపల్లి, పాల్వంచ, దమ్మపేట, పెనగడప ప్రాంతాలను పరిశీలించింది. భూమి లభ్యత, విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, రహదారి అనుసంధానం, భవిష్యత్‌లో విమానాశ్రయ విస్తరణ అవకాశాలపై వివరాలు సేకరించింది. చిన్న విమానాలతో పాటు పెద్ద ప్రయాణికుల విమానాలు దిగేందుకు అవసరమైన పొడవైన రన్‌వే, భద్రతా ప్రమాణాలు, రాత్రివేళ విమానాల రాకపోకలకు...