నా వెంట్రుక కూడా పీకలేవు!

కొమురం భీం , సెప్టెంబర్‌ 5 (మన విశ్వం): సిర్పూర్‌–టి నియోజకవర్గంలో రాజకీయ సమరం మరింత వేడెక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌ తనపై చేసిన విమర్శలకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అదే స్థాయిలో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ‘‘నా నాలుక కోస్తానంటావా..? ఖబర్దార్‌ బిడ్డా.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఇంటికాడనే ఉంటా.. రా.. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందాం’’ అంటూ బహిరంగ సవాల్‌ విసిరారు. శనివారం కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోనప్ప తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘దండే విఠల్‌.. నువ్వు చెంచాగిరి చేసి ఎమ్మెల్సీ పదవి పొందావు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉండి పెద్దపెద్ద...