హిట్ మీ అంటే.. పేస్ట్ కారుద్ది!
కరీంనగర్, సెప్టెంబర్ 5 (మన విశ్వం): సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో నిర్వహించిన ‘యువ సమరభేరి’లో ప్రసంగించిన ఆయన.. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం–మహేష్‌బాబు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డిపై సెటైర్లు పేల్చారు. ‘‘అతడు సినిమాలో బ్రహ్మానందం నాలుగు రోజులు ఎక్సర్‌సైజ్ చేసి బలం వచ్చిందని మహేష్‌బాబును ‘హిట్ మీ యార్.. హిట్ మీ’ అంటాడు. మహేష్‌బాబు గట్టిగా గుద్దగానే కిందికెళ్లి పేస్ట్ కారుతుంది. కేసీఆర్‌తో పెట్టుకుంటే రేవంత్‌రెడ్డి గతి కూడా అదే అవుతుంది’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘మూడు తరాలను ముంచిన ముసలి నక్క’ కాంగ్రెస్‌ను ‘ముసలి నక్క’గా అభివర్ణించిన కేటీఆర్.....