పాస్ చేస్తారా.. ఫెయిల్ చేస్తారా మీ ఇష్టం!
‘‘నన్ను పాస్ చేస్తారా.. ఫెయిల్ చేస్తారా మీ ఇష్టం. నాకు రెండేళ్లు సమయం ఇవ్వండి. టీచర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా. రెండేళ్ల తర్వాత నేను రాసే ఎన్నికల పరీక్షకు మార్కులు వేసేది మీరే. అప్పుడు నన్ను పాస్ చేయాలా.. ఫెయిల్ చేయాలా అన్నది మీ చేతుల్లోనే ఉంది’’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లతో మాట్లాడిన సీఎం.. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని కోరుతూ.. రాబోయే ఎన్నికలను పరీక్షతో పోల్చారు. ప్రభుత్వం చేసిన పనులను చూసి చివరకు మార్కులు వేయాల్సింది ప్రజలు, ఉపాధ్యాయులేనని వ్యాఖ్యానించారు. ‘టీచర్ల...