22ఏ నుంచి పేదల భూములు తొలగించాల్సిందే

22ఏ నిషేధిత జాబితాలో చిక్కుకున్న పేద, మధ్యతరగతి ప్రజల భూములు, ఇళ్లకు వెంటనే విముక్తి కల్పించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చినా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదని విమర్శించారు. ‘భూభారతి పేరుతో భూహారతి చేస్తున్నారు’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత ఆస్తులపైనే హక్కులు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఈటల పేర్కొన్నారు. భూములు, ఇళ్లు విక్రయించుకోలేకపోవడంతో పాటు వాటిపై బ్యాంకు రుణాలు కూడా పొందలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది ఈ సమస్యతో ప్రభావితమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. మల్కాజిగిరి...