కొండాకు వేటు.. సుధారాణికి ‘కుడా’ పగ్గాలు!
వరంగల్ కాంగ్రెస్‌లో ఒకేరోజు కీలక పరిణామాలు సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని సీఎం నిర్ణయం గవర్నర్‌కు సిఫార్సు.. కొండా రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ కుడా చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ గుండు సుధారాణి హైదరాబాద్, (మన విశ్వం): ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ మేరకు గవర్నర్‌కు సిఫార్సు పంపినట్లు వెల్లడైంది. కొద్దిరోజులుగా సురేఖ వ్యవహారంపై ఢిల్లీ స్థాయిలో సాగిన మంతనాల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఇదే సమయంలో వరంగల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా)...