గ్రేటర్‌పై ‘గాజు గ్లాసు’ గురి!
హైదరాబాద్, ఆగస్టు 30 (మన విశ్వం): గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై జనసేన గురిపెట్టింది. మూడు కార్పొరేషన్లలో బలంగా బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధి నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లూరి రామ్ మాట్లాడుతూ.. ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. జనసేన చేపడుతున్న కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రజల పక్షాన...