అప్పుడు మౌనం.. ఇప్పుడు నీతులా?

హైదరాబాద్‌, ఆగస్టు 30 (మన విశ్వం): మహిళలు, మైనర్ బాలికలపై అకృత్యాలకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలన్నదే బీఆర్‌ఎస్‌ స్పష్టమైన వైఖరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ వ్యవహారంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించిన తీరును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కోరడంతోపాటు పార్టీ నుంచి బహిష్కరించడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు చట్టసభల్లో కొనసాగడం సమర్థనీయం కాదన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలను ప్రవీణ్‌కుమార్‌ తప్పుబట్టారు. గతంలో బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల...