నగదు బ్యాగు కోసి రూ.1.50 లక్షలతో పరారీ

అమ్మకాల ద్వారా వసూలైన నగదుపై కన్నేసిన ఓ హెల్పర్‌.. అదను చూసి బ్యాగును కోసి రూ.1.50 లక్షలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు యాద గణేష్‌ (25)ను గీసుగొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.20 వేల నగదు, శామ్‌సంగ్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ డి.విశ్వేశ్వర్‌ వెల్లడించారు. గొర్రెకుంటకు చెందిన తాంటికంటి భాస్కర్‌ ఓ కంపెనీలో నాలుగేళ్లుగా సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 21న డ్రైవర్‌ కుళ్ల సునీల్‌, హెల్పర్‌ యాద గణేష్‌తో కలిసి డీసీఎం వాహనంలో స్వీట్లు, బేకరీ ఉత్పత్తుల విక్రయానికి విజయవాడ, మచిలీపట్నం ప్రాంతాలకు వెళ్లారు. అమ్మకాలు పూర్తిచేసుకుని వసూలైన నగదుతో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ...