‘కాకా’గా మెగాస్టార్‌.. మాస్‌ లుక్‌తో అదరగొట్టిన చిరు!

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 158వ చిత్రానికి ' కాకా ' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజా వీడియో వాటిని మరింత పెంచింది. ఈ చిత్రంలో చిరంజీవి కె. సత్యం అనే అక్వా సంస్థ ఉద్యోగిగా కనిపించనున్నారు. సాధారణ మధ్యతరగతి వ్యక్తిని తలపించే ఆహార్యం, తన చుట్టూ ఉన్న వారితో కలిసిపోయే తీరు తొలి భాగంలో ఆకట్టుకుంటాయి. అయితే కథ అక్కడితో ఆగదు. ప్రశాంతంగా కనిపించే సత్యం...