22-ఏ చిక్కుకు.. 48 గంటల్లో చెక్!
ప్రైవేటు భూమైతే వెంటనే రిజిస్ట్రేషన్ స్లాట్ తీసుకున్న వారి భూములపై 48 గంటల్లో పరిశీలన జాబితాను జల్లెడ పట్టి తప్పులు సరిదిద్దాలి కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం ‘ఒక్క అంగుళం ప్రైవేటు భూమికీ ఇబ్బంది రానివ్వం’ హైదరాబాద్, ఆగస్టు 18 (మన విశ్వం): 22-ఏ నిషేధిత జాబితాలో పొరపాటున ప్రైవేటు భూములు చేరి ఉంటే.. వాటి రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తి 22-ఏ జాబితాలో ఉంటే రెండు రోజుల్లోనే పరిశీలించి.. ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. 22-ఏ భూముల రిజిస్ట్రేషన్లపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,...