తెలంగాణలో క్రీడల పండగ
దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల ప్రతిభకు వేదికగా నిలిచే ఖేలో ఇండియా క్రీడలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. డిసెంబరు 11 నుంచి 22 వరకు 12 రోజులపాటు జరిగే ఈ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. దేశం దృష్టిని ఆకర్షించేలా అత్యున్నత ప్రమాణాలతో క్రీడలను నిర్వహించాలని కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం గురువారం దిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసింది. ఖేలో ఇండియా పోటీల నిర్వహణ, ఏర్పాట్లు, క్రీడా మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించింది. క్రీడల వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, రాష్ట్ర...