రామప్ప అభివృద్ధికి రూ.61.99 కోట్లు.. పనుల్లో నాణ్యతే ప్రధానం

ప్రసాద్ పథకం పనులను పరిశీలించిన మంత్రి సీతక్క గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు వారసత్వ కట్టడం ప్రాచీనతకు భంగం కలగొద్దని స్పష్టం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన పాలంపేట రామప్ప దేవాలయం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ (PRASAD) పథకం కింద చేపడుతున్న రూ.61.99 కోట్ల పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న వసతులు, పర్యాటకులకు అందిస్తున్న...