బోనాలకు రూ.20 కోట్లు.. రంజాన్‌కు రూ.33 కోట్లు ఎందుకు?

హిందూ ఉత్సవాలకు నిధులు పెంచాలి: బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం హిందూ పండుగలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో వ్యాఖ్యలు రాష్ట్రంలో హిందూ పండుగలు, ముఖ్యంగా బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రంజాన్ పండుగ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయిస్తుండగా, బోనాల వంటి రాష్ట్ర పండుగకు కేవలం...