ధాన్యం మాయం చేసిన మిల్లర్ల గుండెల్లో గుబులు..!

ప్రభుత్వ ధాన్యం మాయం చేసిన అక్రమార్కులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపడంతో హన్మకొండ,వరంగల్ జిల్లాల్లోని రైస్ మిల్లర్లలో గుబులు మొదలైంది. ఇటీవల జరిగిన తనిఖీల్లో వెలుగులోకి వచ్చిన అవకతవకల నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లాల్లోని పలు మిల్లులు అధికారుల నిఘాలో ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రభుత్వ ధాన్యాన్ని దారి మళ్లించి అక్రమంగా విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిల్లర్లు ఎప్పుడు తమ మిల్లుపై విజిలెన్స్ బృందాలు దాడి చేస్తాయోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసి కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యవహారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన...