పెళ్లి పేరుతో మోసం..? మాజీ ఎమ్మెల్యేపై కేసు

యువతి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసుల నమోదు లైంగిక వేధింపులు, మోసం, డబ్బుల వసూళ్ల ఆరోపణలు ఆధారాల సేకరణలో పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు హైదరాబాద్, జూలై 31 (మన విశ్వం): హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ఓ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి, అనంతరం మోసం చేశారని బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ప్రకారం, ఇంటర్వ్యూ పేరుతో తనను ఓ ఫ్లాట్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది....