పెద్ది మృతిపై సీఎం రేవంత్ , కేసీఆర్ సంతాపం

ఉద్యమ నేతను కోల్పోవడం తీరని లోటు తెలంగాణ ఉద్యమ సేవలను కొనియాడిన రేవంత్ 'ఆప్త మిత్రుడిని కోల్పోయా' అంటూ కేసీఆర్ ఆవేదన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ ఉద్యమానికి, ప్రజా జీవితానికి తీరని లోటని పేర్కొంటూ ఇద్దరూ వేర్వేరుగా సంతాప సందేశాలు విడుదల చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సందేశంలో పెద్ది...