100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిల చెల్లింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం గడువులోపే అమలు చేసింది. 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, గురువారం మూడో విడతగా మరో రూ.2 వేల కోట్లను విడుదల చేయడంతో మొత్తం చెల్లింపులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 29న తొలి విడతగా రూ.2 వేల కోట్లు, జూన్ 30న రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. తాజాగా...