రామాయణ ట్రైలర్‌తో అంచనాలు రెట్టింపు
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'రామాయణ' చిత్ర తొలి భాగం ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంబంధించిన సుమారు 4 నిమిషాల 9 సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో హుందాతనాన్ని ప్రతిబింబించగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకుంది. మరోవైపు యశ్ రావణుడి పాత్రలో కనిపించిన తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అతని గెటప్, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ స్థాయి నిర్మాణ విలువలు, యుద్ధ సన్నివేశాలు...