గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలి
జిల్లాలో ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల అమలులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా నిర్దేశిత గడువులో భూసేకరణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జే. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, కొనైమాకుల ఎత్తిపోతల పథకం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఇన్నర్ రింగ్ రోడ్, జాతీయ రహదారి–163జీ, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, భూ స్వాధీనం, పరిహారం...