తెలంగాణ నయాగరా ఉగ్రరూపం!

ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, తెలంగాణ నయాగరా గా పేరొందిన బొగత జలపాతం భారీ వరదతో ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో జలపాతానికి భారీగా వరద చేరడంతో నిండుకుండలా మారింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న జలధార పర్యాటకులను అబ్బురపరుస్తున్నప్పటికీ, ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 160మీటర్ల వెడల్పున, 50అడుగుల ఎత్తు నుంచి భారీ నీటి ప్రవాహం ఉరకలెత్తుతూ కిందకు దూసుకెళ్తోంది. జలపాతం ఉధృతికి పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన రక్షణ వలయం కారిడార్ పూర్తిగా నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు చేపట్టారు. భద్రాచలం–ఏటూరునాగారం అటవీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల...