10 వేల మీటర్లలో గుల్వీర్ చరిత్ర

కామన్వెల్త్ అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల 10 వేల మీటర్ల పరుగులో పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. గ్లాస్‌గోలోని స్కాట్‌స్టోన్ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో గుల్వీర్ 27 నిమిషాల 49.78 సెకన్లలో రేసును పూర్తి చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ విజయంతో కామన్వెల్త్‌లో భారత అథ్లెటిక్స్‌కు మరో రజత పతకాన్ని అందించాడు. స్వర్ణ పతకాన్ని ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్‌సన్ 27:48.93 నిమిషాల టైమ్‌తో సొంతం చేసుకోగా, గుల్వీర్ కేవలం స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. భారీ వర్షం మధ్య జరిగిన పోటీలో ప్రారంభం నుంచే అగ్రశ్రేణి అథ్లెట్లతో పోటీపడిన గుల్వీర్,...