ఒకే రీఛార్జ్‌లో ఓటీటీలు, లైవ్ టీవీ రూ.200కే 'వి' కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్
ప్రీపెయిడ్ వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వి) కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఓటీటీ స్ట్రీమింగ్, లైవ్ టీవీ సేవలు, మొబైల్ డేటా ప్రయోజనాలను ఒకే రీఛార్జ్‌లో అందించేలా ఈ ప్లాన్‌ను రూపొందించింది. రూ.200 ధరతో లభించే ఈ 'వి మూవీస్ & టీవీ' ప్లాన్‌కు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో 30 జీబీ హైస్పీడ్ డేటాతో పాటు 20 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, 200కుపైగా లైవ్ టీవీ ఛానెళ్లను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, షెమారూ మీ, మనోరమా మ్యాక్స్ వంటి ప్రముఖ ఓటీటీ సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయి. అర్హత...