ప్రపంచ నంబర్‌వన్‌గా యాపిల్!

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ మరో చారిత్రక ఘనతను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువలో ఎన్విడియాను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత విలువైన పబ్లిక్ కంపెనీగా మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికా స్టాక్ మార్కెట్‌లో మంగళవారం ట్రేడింగ్ సందర్భంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండో సంస్థగా యాపిల్ చరిత్ర సృష్టించింది. ట్రేడింగ్ సమయంలో యాపిల్ షేరు ధర గరిష్ఠంగా 342.89 డాలర్లకు చేరుకోవడంతో కంపెనీ మార్కెట్ విలువ 5.036 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. అయితే చివరి గంటల్లో స్వల్ప లాభాల స్వీకరణతో షేరు ధర కొద్దిగా తగ్గడంతో మార్కెట్ విలువ మళ్లీ...