స్కైరూట్ ప్రతినిధులతో రేవంత్ భేటీ

​తెలంగాణలో ఏరోస్పేస్, స్పేస్‌టెక్ రంగానికి పూర్తి సహకారం ​విక్రమ్-1 విజయాన్ని వివరించిన సంస్థ వ్యవస్థాపకులు అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల పురోగతికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ సి.ఇ.ఒ పవన్ కుమార్ చందన, సి.ఒ.ఒ భరత్ డాకాలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి, పెట్టుబడులు, పరిశోధనలపై ఇరువర్గాలు సుదీర్ఘంగా చర్చించాయి. ​చారిత్రాత్మక విజయం సాధించిన 'విక్రమ్-1' ​భారత ప్రైవేటు రంగానికి చెందిన తొలి ఆర్బిటల్-తరగతి రాకెట్ 'విక్రమ్ -1' ను విజయవంతంగా ప్రయోగించిన తీరును స్కైరూట్ ప్రతినిధులు సిఎంకు వివరించారు. ​ఈ ప్రయోగంతో...