ఏం చేస్తారో చేయండి... మా పెద్దిని కాపాడండి!

యశోద వైద్యులకు కేసీఆర్ వేడుకోలు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత మరో 48 గంటల తర్వాతే స్పష్టత: వైద్యులు ప్రపంచస్థాయి చికిత్స అందిస్తున్నామని వెల్లడి హైదరాబాద్, జూలై 27 (మన విశ్వం): తీవ్ర అస్వస్థతతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులతో సుదీర్ఘంగా చర్చించి చికిత్స వివరాలు తెలుసుకున్న ఆయన, "ఏం చేస్తారో చేయండి... మా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడండి" అంటూ చేతులెత్తి నమస్కరిస్తూ...