తొలి ఏకాదశి.. భక్తి, నియమానికి ప్రతీక

చాతుర్మాస్యానికి శ్రీకారం చుట్టే మహా పర్వదినం మహావిష్ణు యోగనిద్ర ఆరంభమనే విశ్వాసం ఉపవాసం, జాగరణ, దానధర్మాలతో ఆధ్యాత్మిక సాధన దేశవ్యాప్తంగా విష్ణు ఆలయాల్లో ప్రత్యేక ఉత్సవాలు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిగా వచ్చే ఈ పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో "తొలి ఏకాదశి"గా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో దేవశయని ఏకాదశి, హరి శయని ఏకాదశి, ఆషాఢి ఏకాదశి, పద్మ ఏకాదశి పేర్లతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ రోజు నుంచి మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని, అదే చాతుర్మాస్య ప్రారంభానికి సంకేతమని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఈ రోజును లక్షలాది మంది భక్తులు అత్యంత...