ప్రశ్నపత్రాల లీక్‌లపై దేశం రగిలింది!

రాజీనామా డిమాండ్‌తో వీధుల్లోకి విద్యార్థులు.. దేశవ్యాప్తంగా ఉధృతమైన ఆందోళనలు ఆందోళనకారులపై లాఠీచార్జీలతో ఉద్రిక్త పరిస్థితులు సీజెపి, ప్రతిపక్ష పార్టీల మద్దతుతో మరింత విస్తరిస్తున్న ఉద్యమం 'రాజీనామా వరకు పోరాటం ఆగదు' అంటూ విద్యార్థి సంఘాల హెచ్చరిక ప్రత్యేక ప్రతినిధి, (మన విశ్వం): దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తీవ్ర రాజకీయ, సామాజిక దుమారం రేపుతోంది. పరీక్షల పారదర్శకత దెబ్బతినడంతో లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు, యువజన సంస్థలు ఆందోళనలను మరింత ఉధృతం చేశాయి. రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్ర రాజధానుల్లో...