విద్యార్థుల నుంచీ ఫీడ్‌బ్యాక్
ప్రతి ఒక్కరికీ యూనిఫామ్... లోపాలుంటే సహించేది లేదు ఆగస్టు 15 నాటికి పంపిణీ పూర్తికావాలి వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూన్ 2కే పాఠశాలలకు.. అధికారుల సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దుస్తుల పంపిణీ పూర్తయిన తర్వాత వాటి నాణ్యత, పరిమాణం (సైజు) తదితర వివరాలపై ప్రతి విద్యార్థి నుంచి నేరుగా 'వాట్సాప్' ద్వారా అభిప్రాయాలను (ఫీడ్‌బ్యాక్) సేకరించనున్నట్లు వెల్లడించారు. పిల్లలు ఇచ్చే సూచనలు, ఫిర్యాదుల ఆధారంగానే వచ్చే విద్యాసంవత్సరం నుంచి రంగుల ఎంపిక, పంపిణీ విధానంపై తుది నిర్ణయం తీసుకుంటామని...