ఇంచార్జి మంత్రి స్పందించేనా?

లారీల్లేవు.. రవాణా లేదు.. అయినా రూ. 4.81 కోట్లు గప్‌చుప్! ​నకిలీ కాగితాలతో ‘పౌర’ధనానికి పెద్ద గండి ఉమ్మడి జిల్లా సమీక్షకు నేడు రానున్న ఇన్‌ఛార్జి మంత్రి విజిలెన్స్ విచారణకు ఆదేశించేనా? ​ ​లారీ రోడ్డెక్కలేదు.. ధాన్యం బస్తా అసలే కదల్లేదు.. కానీ కాగితాల్లో మాత్రం రవాణా పూర్తయిపోయింది! దానికి తగ్గట్టే పౌరసరఫరాల సంస్థ నుంచి రూ.4.81 కోట్ల ప్రజాధనం గుట్టుచప్పుడు కాకుండా కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి చేరిపోయింది! కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హన్మకొండ జిల్లాలో వెలుగుచూసిన ఈ భారీ 'రవాణా స్కాం' ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ​కాగితాల్లోనే 'ధాన్యం' చక్రాలు! ​పౌరసరఫరాల శాఖలో ధాన్యం రవాణా పేరిట జరిగిన ఈ దోపిడీ అంతా...