పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయండి: సోనమ్ వాంగ్‌చుక్
ఆసుపత్రి నుంచే ఉద్యమకారుడి పిలుపు అరెస్టుపై తీవ్ర అభ్యంతరం.. సీజేపీ ఆందోళనకు మద్దతు వాంగ్‌చుక్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తుండగా అరెస్టయిన ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నుంచే ఆయన తన మద్దతుదారులకు ఒక కీలక సందేశాన్ని పంపారు. ఈ నెల 20న (సోమవారం) చేపట్టదలచిన 'పార్లమెంట్ మార్చ్'ను భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. 'కాక్రోచ్ జనతా...