ఫోర్ట్ రోడ్ బొడ్రాయి సన్నిధానంలో ఘనంగా మహా అన్నదానం

వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకుని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ​దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు ​గత 20 నెలలుగా విరామం లేకుండా ప్రతి అమావాస్యకు ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతల సేవాభావం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ​ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో...