​మైనర్ బాలికపై లైంగిక దాడి: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్

గర్భస్రావ మాత్రలు ఇచ్చి అఘాయిత్యం.. రౌడీషీట్ తెరుస్తామని ఏసీపీ హెచ్చరిక ​వరంగల్ : ప్రేమ పేరుతో నమ్మించి ఓ మైనర్ బాలికపై వరుసగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, ఆమె గర్భం దాల్చడంతో మోసపూరితంగా గర్భస్రావం చేయించిన నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలను మామునూరు ఏసీపీ వెంకటేష్ వెల్లడించారు. ​నమ్మించి అఘాయిత్యం.. ​పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌కు చెందిన బొడ్డు బన్నీ (21) అనే యువకుడికి, గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలికతో 2023లో పదో తరగతి చదువుతున్న సమయంలో స్నేహితురాలి ద్వారా పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ నమ్మించిన నిందితుడు...