పోక్సో కేసు కక్ష.. గొడ్డలితో ఊచకోత ఆరుగురి దారుణ హత్య..
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న సామూహిక హత్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. తనపై పోక్సో కేసు నమోదు చేయించారనే కక్షతో ఓ వ్యక్తి గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. పగ తీర్చుకోవడానికే పరిమితం కాకుండా అడ్డువచ్చిన తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారులను కూడా కిరాతకంగా హతమార్చడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తిపై గత మే నెలలో ఓ మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలతో షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. బాధిత బాలిక, ఆమె తల్లి ఇచ్చిన...