వృద్ధురాలిపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారయత్నం!
వృద్ధురాలిపై కాంగ్రెస్ కౌన్సిలర్ అత్యాచారయత్నం! నగ్నంగా ఇంట్లోకి చొరబడిన వైనం నిందితుడిని బాత్రూంలో బంధించి పోలీసులకు అప్పగించిన స్థానికులు సభ్యసమాజం తలదించుకునేలా ఓ ప్రజాప్రతినిధి బరితెగించాడు. నగ్నంగా ఇంట్లోకి చొరబడి, నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఘోర కలియుగ ఘటన స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపాలిటీ పరిధిలోని చాగల్ గ్రామానికి చెందిన 9వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ చౌదరపల్లి సంపత్ రాజ్ అర్ధరాత్రి దాటిన తర్వాత నగ్నంగా మారి, స్థానికంగా ఉంటున్న ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. గాఢనిద్రలో ఉన్న ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. హడలెత్తిన వృద్ధురాలు.. బాత్రూంలో బందీ! మృగాడి ప్రవర్తనతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి...