మణిపూర్‌లో ఉగ్రఘాతుకం: ఇద్దరు జవాన్ల వీరమరణం
ఉఖ్రుల్‌లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి ఐఈడీ పేల్చి, కాల్పులు జరిపిన ఉగ్రవాదులు పలువురికి గాయాలు.. అడవుల్లో ముమ్మర గాలింపు మణిపూర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన మెరుపు దాడిలో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. భద్రతా దళాల కథనం ప్రకారం... ఉఖ్రుల్ జిల్లాలో విధుల్లో ఉన్న అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ కదులుతుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముందుగా అత్యంత శక్తిమంతమైన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ను పేల్చారు. ఆ వెంటనే జవాన్లపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఆకస్మిక దాడితో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా...