​ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందే బెదిరింపులు!

'మెల్‌బోర్న్ మీట్స్ మోదీ' ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ ​రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ .. పలు కోణాల్లో దర్యాప్తు ​భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాబోయే ఆస్ట్రేలియా పర్యటనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయి బెదిరింపులు రావడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. జూలై 9న మెల్‌బోర్న్‌లోని ప్రసిద్ధ మార్వెల్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించాల్సిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కమ్యూనిటీ ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ ఒక ఆగంతకుడు ఫేస్‌బుక్‌లో హెచ్చరికలు జారీ చేశాడు. ​రూఫ్ టాప్ క్లోజ్ చేయకపోతే అంతే..! ​ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఫేస్‌బుక్ ప్రకటన కింద 'అబు ముస్తఫా' అనే...