లక్ష్మీబాయి ఆకస్మిక బదిలీ: కక్షసాధింపే అన్న హరీష్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీబాయి పై బదిలీ వేటు మార్కెటింగ్ డైరెక్టర్ పోస్టు నుంచి హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా స్థానచలనం ప్రశ్నిస్తున్నారనే పగతోనే ఇదంతా.. రిటైర్మెంట్ రూల్స్‌ను తుంగలో తొక్కారు: హరీష్ రావు ఫైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీబాయిపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెను ఆ స్థానం నుండి హఠాత్తుగా తప్పించి, హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా...