​డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువతే కీలకం: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్

​ఘనంగా ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ '2కే రన్' ​హాజరైన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్ ​ మాదకద్రవ్యాల మహమ్మారి లేని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో యువత, విద్యార్థులు సైనికుల్లా ముందుండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నగరంలో భారీ ‘2కే రన్’ నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వరకు సాగిన ఈ పరుగును సీపీ సన్‌ప్రీత్ సింగ్, స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, కుడా చైర్మన్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు....