అభిమాన బాలుడి కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

హనుమకొండలో అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌ను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం రూ. లక్ష ఆర్థిక సాయం.. కుటుంబానికి భరోసా.. జీవనోపాధికి సహకారం అందించాలని ఆదేశం హనుమకొండ, జూన్ 17 (మన విశ్వం): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తన అభిమాని కోరికను తెలుసుకున్న ఆయన స్వయంగా హనుమకొండకు వెళ్లి బాలుడిని పరామర్శించారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. హనుమకొండ నగరంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధి కారణంగా అతని శారీరక ఎదుగుదల దెబ్బతిని, చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యాడు....