భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?

తెలంగాణలో భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం చూపే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సవరించిన కొత్త మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమలులోకి వచ్చాయి. ఇకపై రాష్ట్రంలోని 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లు కొత్త విలువల ఆధారంగానే నిర్వహించనున్నారు. ప్రభుత్వం వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 నుంచి 100 శాతం వరకు పెంచింది. ప్లాట్ల విలువల్లో కూడా భారీ మార్పులు చేసింది. అపార్ట్‌మెంట్లకు మాత్రం 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెంపు ఇచ్చింది. బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక...