హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు! అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఎబోలా వైరస్‌ అనుమానిత కేసుల సంఖ్య రెండుకు చేరుకోవడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తుండగా, తాజాగా సూడాన్‌కు చెందిన మరో వ్యక్తిలో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడాన్‌కు చెందిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్‌ (36) ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షలు, స్క్రీనింగ్‌ సమయంలో అతడిలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలను అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్‌...