అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలపై విచారణ పేరుతో కాలయాపన ఎందుకు?
డాక్యుమెంట్ నంబర్లతో సహా కథనాలు వెలువడినా చర్యలేవీ?
జిల్లా రిజిస్ట్రార్ నుంచి డీఐజీకి నివేదిక వెళ్లిందా?.. అసలు విషయం ఆయన దృష్టికి చేరిందా?
గతంలో రాజేష్‌పై మూడు రోజుల్లోనే వేటు.. వెంకట్‌లాల్ విషయంలో మీనమేషాలెందుకు?
అధికారిని కాపాడుతున్నారా?.. ఆరోపణలను తేలిగ్గా తీసుకుంటున్నారా?
వరంగల్, అక్టోబర్ 31 (మన విశ్వం): ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాదాస్పద రిజిస్ట్రేషన్ల వ్యవహారం రోజురోజుకూ మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ వెంకట్‌లాల్‌పై అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారుల చర్యల్లో జాప్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకే ఇంటి నంబర్‌తో పలు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు, సాదాబైనామా వ్యవహారాలు, నాలా అనుమతులపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత డాక్యుమెంట్ నంబర్లతో సహా ‘మన విశ్వం’ వరుస కథనాలు ప్రచురించినప్పటికీ విచారణ ఎంతవరకు వచ్చిందనే విషయంపై స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమైంది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.
రాజేష్‌కు ఓ న్యాయం.. వెంకట్‌లాల్‌కు మరో న్యాయమా?
గతంలో ఇదే కార్యాలయంలో పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ రాజేష్‌పై మూడు రోజుల్లోనే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుత ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ వెంకట్‌లాల్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో అదే వేగం ఎందుకు కనిపించడం లేదన్నది ప్రధాన ప్రశ్న. రెండు వ్యవహారాల్లో ఆరోపణల తీవ్రత, ఆధారాలు, విచారణ స్థితి వేర్వేరుగా ఉండవచ్చు. అయినప్పటికీ చర్యల విషయంలో కనిపిస్తున్న వ్యత్యాసానికి ఉన్నతాధికారులు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తున్నాయా? లేక అధికారుల నిర్ణయాల్లో తేడా ఉందా?
డీఐజీ దృష్టికి వెళ్లిందా?
ఈ వ్యవహారంలో జిల్లా రిజిస్ట్రార్ పాత్రపైనా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వివాదాస్పద రిజిస్ట్రేషన్లపై ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం ఉన్నప్పటికీ, తదుపరి చర్యలపై స్పష్టత లేదు. అసలు ఈ వ్యవహారాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ దృష్టికి తీసుకెళ్లారా? ఆరోపణలకు సంబంధించిన డాక్యుమెంట్లు, నోటీసులు, వివరణలతో కూడిన నివేదిక సమర్పించారా? డీఐజీ ఏవైనా ఆదేశాలు ఇచ్చారా? అనే ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
విచారణా?.. కాలయాపనా?
డాక్యుమెంట్ నంబర్లు బయటకు వచ్చినంత మాత్రాన అక్రమాలు నిర్ధారణ అయినట్లు కాదు. అయితే వాటి ఆధారంగా నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్నది తేల్చడం సంబంధిత అధికారుల బాధ్యత. విచారణ పేరుతో నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేస్తే శాఖ విశ్వసనీయతపైనే సందేహాలు పెరిగే ప్రమాదముంది. ఒకే ఇంటి నంబర్‌తో రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? అవసరమైన అనుమతులు పరిశీలించారా? సంబంధిత రికార్డులను తనిఖీ చేశారా? అన్న అంశాలపై స్పష్టమైన నివేదిక అవసరం.
కాపాడుతున్నదెవరు?.. తేల్చాల్సింది అధికారులే!
వెంకట్‌లాల్‌ను ఎవరైనా కాపాడుతున్నారా? లేక విచారణ ప్రక్రియలో సహజంగానే జాప్యం జరుగుతోందా? అన్నది ప్రస్తుతం నిర్ధారణ కాని అంశం. అయితే ఈ అనుమానాలకు తెరదించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే. ఆరోపణలు నిజమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిరాధారమైతే ఆ విషయాన్ని ఆధారాలతో బహిర్గతం చేయాలి. అంతేకానీ విచారణ పురోగతిని వెల్లడించకుండా మౌనం కొనసాగిస్తే ప్రజల్లో అనుమానాలు మరింత బలపడతాయి. ఖిలా వరంగల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో జిల్లా రిజిస్ట్రార్ నిర్ణయం ఏమిటి? డీఐజీ జోక్యం చేసుకుంటారా? గతంలో చూపిన వేగం ఇప్పుడెందుకు కనిపించడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులే!